
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 195.
పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 40, టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా) 20, ట్రేడ్ అప్రెంటీస్ 135.
ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ విభాగంలో బి.టెక్/ బీఈ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా): ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటీస్: సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: కనిష్ట వయసు 18.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 27.
లాస్ట్ డేట్: అక్టోబర్ 28.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.