కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురైంది. అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను బుధవారం (మార్చి 27) విచారించిన ఢిల్లీ హైకోర్టు..కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయలేమని చెప్పింది. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 3 కు వాయిదా వేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టును కోరారు. కేజ్రీవాల్ పిటిషన్ విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం..ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయలేమని చెప్పింది. 

మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 22న రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయనను హాజరు పర్చారు. లిక్కర్ స్కాం లో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే కేవలం ఏడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమంతించింది.కాగా కేజ్రీవాల్ కస్టడీ రేపటితో(గురువారం)  ముగియనుంది.