బన్సీలాల్పేటలో డెంగ్యూ పాజిటివ్కేసు.. అప్రమత్తమైన అధికారులు

బన్సీలాల్పేటలో డెంగ్యూ పాజిటివ్కేసు.. అప్రమత్తమైన అధికారులు
  • అప్రమత్తమైన అధికారులు

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్​పేట డివిజన్​లోని కీస్ బ్లాక్ జైనగర్​లో ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం డిప్యూటీ కమిషనర్ డాకునాయక్ ఆధ్వర్యంలో ఎంటమాలజీ బృందం కాలనీని సందర్శించి, దోమల నివారణ మందులు స్ప్రే చేసి, ఫాగింగ్ నిర్వహించారు. స్థానికులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ ఉంచుకోవద్దని సూచించారు. హెల్త్ ఆఫీసర్ హేమలత, డిప్యూటీ ఈఈ, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ రాజేందర్ రెడ్డి, మహ్మాద్ సాధిక్, సిబ్బంది ఉన్నారు.