యవ్వనంలో.. మనలో కొత్త కలలు మొదలవుతాయి. కొత్త కలయికలు, తొలి ప్రేమ, తొలి బాధలు ఇవి అన్నీ జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తాయి. ఈ దశలో కొన్ని విషయాలు వదులుకుంటే మంచిది.అవేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
కొన్ని అనుభవాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అవి మనలో బలాన్ని, సహనాన్ని, నిజమైన ప్రేమను నేర్పిస్తాయి. వాటిని వదిలివేయడం అంటే మన జీవితాన్ని కోల్పోయినట్లేనని భావిస్తుంటారు.
మన గురించి అసలు పట్టించుకోని సంబంధాలు గురించి తెగ ఆలోచిస్తూ ఉంటాము. కొంతమంది మన ఆనందాన్ని చిన్నచూపు చూసి... ఆశల పేరుతో మనల్ని నట్టేట ముంచుతారు. నిజానికి మధ్య వయస్సు లోనే.. నిజమైన జీవితం గురించి తెలుస్తుంది. ఈ దశలోనే మనకు జీవితంపై అసలైన అర్థం తెలుస్తుంది. ఎవరు నిజంగా మన తోడు ఉంటారో.. ఎవరు కేవలం అవసరానికి వచ్చి పోతారో అర్థమవుతుంది.
ఇలా గడుస్తున్న జీవితంలో పెళ్లి అనే తంతుతో మరో జీవితం మొదలవుతుంది. కొంతకాలం బాగానే ఉన్నా.. అప్పటి వరకు భార్య మీద భర్తకి... భర్త మీద భార్యకి.. కోపతాపలు... ఆకర్షణ కోల్పోవడం లాంటివి జరిగిన కూడా ఆబంధం ఎంత ముఖ్యమో అవగాహన ఏర్పడే దశ ఏర్పడుతుంది. ఇంకా మన ఇంటి మనుషులు కాకుండా వేరే వ్యక్తుల మీద ఆకర్షణ వ్యామోహం అన్ని ఒక కొలిక్కి వచ్చి ... కమ్ముకున్న మబ్బు తెరలు వదులుకొని మనసు... అన్ని విషయాలు తెలిసిన నిజంలో బతికే అవసరం ఏర్పడే రోజులు కూడా ఈ వయసులోనే.. ఈ దశ లోనే మొదలవుతాయి. అయితే ఈ దశలో జీవితం సాఫీగా కొనసాగాలంటే.. కొన్నింటిని వదులుకోవాలి.
- అతిగా బాధపడే మనస్థత్వం
- అవసరం లేకున్నా నచ్చని సంబంధాలు కొనసాగించడం
- మన గతంతో ముడిపడి బ్రతకును ఈడ్చడం
- ఇప్పుడు ఏది అవసరమో.. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో నిర్దారించుకోవడం
- పాత ఙ్ఞాపకాలను తవ్వుకొని ఆలోచించడం
అలా అని ఈ దశలో కొన్ని అనుబంధాలను, కొన్ని జ్ఞాపకాలను వదిలేయడం చాలా కష్టం. కాని కొన్నింటిని వదిలేస్తే మన ఆత్మకే వెలితి మిగిలిపోతుంది.కానీ కొన్ని జ్ఞాపకాలు వదిలేస్తే మన భారతీయ ప్రయాణానికే అర్థం ఉండదు. ఇలా కొన్ని బరువులు వదిలేస్తే మన ప్రయాణం తేలిక అవుతుంది.
ఎందుకంటే జీవితం అంటే.. ఒంటరిగా ప్రయాణం మొదలవుతుంది. ఈ మధ్యలో ఎన్నో అనుభవాలు, ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఎవరినో, ఏదో వదులుకోవడం తప్పదు. అలా కొన్నిటిని వదులుకుంటే మనసు తేలికగా ఉంటుంది.
కానీ ఏది వదులుకోవాలో, ఏది జీవితాంతం గుండెల్లో పెట్టుకోవాలో తెలిసినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది. మరికొన్నిటిని వదిలేస్తే మనలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది.ఇదే జీవితం. కొన్నిటిని వదులుకుంటే మన మనసుకు శాంతి దొరుకుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
