
ఐపీఎల్ 2025లో శనివారం (మే 3) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ను అంపైర్ ఔట్ అని ప్రకటించినా రెండు పరుగులు తిరగడం వైరల్ గా మారుతుంది. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 17 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో మూడో బంతిని బెంగళూరు ఫాస్ట్ బౌలర్ ఎంగిడి ఫుల్ టాస్ వేశాడు. స్లో బాల్ కావడంతో బంతిని బ్రెవిస్ అంచనా వేయలేక ఆడలేకపోయాడు. బాల్ ప్యాడ్లకు తగలడంతో ఆర్సీబీ అప్పీల్ చేసింది. అంపైర్ బ్రెవిస్ ను ఔట్ గా ప్రకటించాడు. సరిగా ఇక్కడే డ్రామా చోటు చేసుకుంది.
ఒకసారి అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చిన తర్వాత పరుగు తీయడానికి ఉండదు. అది డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. అయితే జడేజా, బ్రెవిస్ మాత్రం అంపైర్ ఔటిచ్చినప్పటికీ ఒకటి కాదు.. ఏకంగా రెండు పరుగులు రాబట్టారు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకొని DRS కు కోరారు. అప్పటికే సమయం పూర్తి కావడంతో రివ్యూ తీసుకోవడానికి వీలు లేదని అంపైర్ బ్రెవిస్ కు చెప్పి పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత రీప్లేలో బాల్ వికెట్లను మిస్ అయినట్టు చూపించింది. ఔటైన అని అంపైర్ ప్రకటించిన వెంటనే రివ్యూ తీసుకుంటే బ్రెవిస్ నాటౌట్ అయ్యేవాడు. కానీ జడేజా, బ్రెవిస్ చేసిన తప్పిదం కారణంగా చెన్నై వికెట్ తో పాటు మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
జడేజా, బ్రెవిస్ పై నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. అంపైర్ ఒక్కసారి ఔటిచ్చిం తర్వాత ఎలా పరిగెడతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికీ కనీసం కామన్ సెన్స్ లేదంటూ ఫైరవుతున్నారు. అంతకముందు బంతి ఆయుష్ మాత్రే ఔట్ కావడం.. గందరగోళంలో బ్రెవిస్ కూడా ఆ తర్వాత బంతికే పెవిలియన్ కు చేరడం చెన్నై పరాజయానికి దారి తీసింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 రన్స్ తేడాతో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (94) పోరాటం వృధా అయింది.
Also Read : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న కోల్‌కతా
హైస్కోరింగ్ పోరులో తొలుత బెంగళూరు20 ఓవర్లలో 213/5 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ ( 33 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62), బెథెల్ (33 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 )తో పాటు చివర్లో రొమారియో షెఫర్డ్ (14 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 53 నాటౌట్) మెరుఫు ఫిఫ్టీ కొట్టాడు. ఛేజింగ్‌లో సీఎస్కే 20 ఓవర్లలో 211/5 స్కోరు చేసి ఓడింది. లుంగి ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టాడు. షెఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు.
There was no 15-second DRS timer shown on screen, and when Brevis wanted to review it, the umpires said, 'No, you have to leave.'#RCBvsCSK #yashdayal #umpire #csk #IPL2025 pic.twitter.com/8yQYAqwWj1
— Sagar Kumar Mishra (@mrsagarmishraa) May 4, 2025