
సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (మే 4) రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు టోర్నీలో కేకేఆర్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. మరో వైపు రాజస్థాన్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్ లో బెంచ్ కు పరిమితమైన మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ తుది జట్టులో స్థానం సంపాదించారు. మరోవైపు రాజస్థాన్ ఏకంగా మూడు మార్పులు చేసింది. హసరంగా, కునాల్ రాథోర్, యద్విర్ ప్లేయింగ్ 11 లోకి వచ్చారు.
Also Read : మళ్లీ ఓడిన అమ్మాయిలు
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా