
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varmaa)..ఈ పేరు వింటే కొన్ని సార్లు సంచలన డైరెక్టర్ అని..ఇంకొన్ని సార్లు వివాదాస్పద డైరెక్టర్ అని..మరికొన్ని సార్లయితే ది గ్రేట్ డైరెక్టర్ అని అంటుంటాం. ఎందుకంటే, ఆయన అనౌన్స్ చేసే సినిమాల ప్రభావం..థియేటర్లలో రిలీజై వరకు జనాల్లో మార్మోగుతోంది. రీసెంట్ గా వ్యూహం ఎంత సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇపుడు అది మరవక ముందే..మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసేశాడు.
నా పెళ్ళాం దెయ్యం(Naa Pellam Deyyam) అంటూ తనదైన శైలిలో టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో వంటగదిలో ఓ లేడీ కనిపిస్తుండగా..పక్కన బల్లపై తాళిబొట్టు కనిపిస్తుండడం ఇక్కడ విశేషం అయింది. అదేంటీ? తాళిబొట్టు మెడలో ఉండాలి కదా వర్మ అని అడిగితే మాత్రం..వంటగదిలో ఉన్నది మాత్రం భార్య కాకపోవొచ్చు అనే సమాధానం మాత్రం ఇస్తాడు.నా పెళ్ళాం దెయ్యం అంటున్న ఆర్జీవీ..ఇలా ఎలా ఆలోచిస్తారు వర్మ!అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ALSO READ :- Arundhati Nair: ప్రాణాలతో పోరాడుతోన్న హీరోయిన్ ..చికిత్సకు డబ్బుల్లేక ఆర్ధిక సాయం కోసం అభ్యర్ధన
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్జీవీ శపథం, శారీ అనే చిత్రాలు చేస్తున్నాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024