
హైదరాబాద్: వాతావరణంలో మార్పులతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు అధికారులు. రాజమండ్రి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావాల్సిన రెండు ఫ్లైట్లను బెంగళూరుకు మళ్లించారు. పాట్నా నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాన్ని విజయవాడుకు మళ్లించారు. ఇటు చేవెళ్ల నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి బీజాపూర్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. మీర్జాగూడ - చిట్టం పల్లి గ్రామాల హైవే మధ్య భారీ చెట్లు విగిరిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.