కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు పంపింది. ఈడీకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తన రాజ్యాంగ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు సమన్ల సమయం అడ్డుగా వస్తోందని శివకుమార్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, మరికొద్ది రోజుల్లో కర్ణాటకలోకి ‘భారత్ జోడో యాత్ర’ ప్రవేశించనున్న కీలక తరుణంలో.. శివకుమార్‌కు ఈడీ సమన్లు పంపింది. ఈడీ కావాలనే తనకు నోటీసులు జారీ చేసిందని శివకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 1న కర్ణాటకలోకి ఎంటర్ కానుంది.
Karnataka Congress Pres DK Shivakumar says he has been summoned by ED as Legislative Assembly session is underway
— ANI (@ANI) September 15, 2022
"I'm ready to cooperate but timing of this summon &harassment I am put through, is coming in the way of discharging my constitutional and political duties," he adds. pic.twitter.com/DchwSsDHE5
