
బీహార్ పాట్నాలో ఒక విచిత్రమైన కేసు బయటికొచ్చింది. ఏకంగా ఒక కుక్కకి రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారు. బీహార్ ప్రభుత్వం జారీ చేసిన ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్లో ఉన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుక్క పేరును డాగ్ బాబు అని, దాని తండ్రి పేరును కుత్తా బాబు అని అలాగే కుక్క తల్లి పేరు కుటియా దేవి అని అందులో రాశారు. ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ మసౌర్హి జోనల్ ఆఫీస్ నుండి జారీ చేయగా, సర్టిఫికెట్‌కు కుక్క ఫోటో కూడా ఉంది.
కేస్ ఫైల్ చేసిన పోలీసులు: మసౌర్హి జోన్‌లో డాగ్ బాబు పేరుతో రెసిడెన్సీ సర్టిఫికెట్ జారీ చేసిన కేసు వెలుగులోకి వచ్చాక జిల్లా యంత్రాంగం దీనిని వెంటనే రద్దు చేశారు. అలాగే ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. దీనితో పాటు దరఖాస్తుదారుడు, కంప్యూటర్ ఆపరేటర్, రెసిడెన్సీ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారిపై పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తు రిపోర్ట్ 24 గంటల్లోగా జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని మసౌర్హి సబ్‌డివిజన్ అధికారిని ఆదేశించారు.
Also Read:- పులుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మీకోసం..
ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసింది ఎవరంటే: ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ జారీతో ప్రజలు ప్రభుత్వ పని తీరుపై ప్రశ్నలు కురించారు. సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో ఫామ్‌ను రెవెన్యూ అధికారి, సంబంధిత సిబ్బంది వెరిఫై చేస్తారని చెబుతారు, కానీ అలా జరగలేదు. అదికూడా జోనల్ ఆఫీస్ రెవెన్యూ అధికారి డిజిటల్ సంతకంతో జారీ చేసిన ఈ సర్టిఫికెట్ మరింత చర్చనీయాంశంగా మారింది. మసౌర్హి జోన్ ఆఫీసర్ ప్రభాత్ రంజన్ మాట్లాడుతూ, ఎవరో ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకున్నారని, వెరిఫికేషన్ సమయంలో ఆఫీస్ సిబ్బంది దానిపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఇదంతా ఎవరు చేశారో దరఖాస్తుదారుడి ఐడి నుండి తెలుసుకుంటామని ఆయన అన్నారు