బషీర్బాగ్, వెలుగు : మహాభారతంలో కౌరవుల చెల్లెలు అయిన దుశ్శల జీవితంలోని కొత్త కోణాన్ని ఏకపాత్రాభినయం రూపంలో తను ప్రదర్శించనున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతి కళాభవన్ లోని తన కార్యాలయంలో ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ ను ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా అలేఖ్య మాట్లాడుతూ తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, త్రిష్ణ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, సూత్రధార్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతిలో దుశ్శల మోనోలాగ్ ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ప్రముఖ నట దర్శక ప్రయోక్త, బాలీవుడ్ నటుడు వినయ్ వర్మ దర్శకత్వంలో 80 నిముషాలపాటు దుశ్శల ఏకపాత్రను ప్రదర్శించునున్నట్లు వివరించారు. బుక్ మై షో ద్వారా ఎంట్రీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
