ఒంటరిగా ఉన్నా..  హ్యాపీగా ఉండొచ్చు

ఒంటరిగా ఉన్నా..  హ్యాపీగా ఉండొచ్చు

అప్పటివరకు ఇంట్లో వాళ్లతో కలిసి ఆనందంగా ఉన్నవాళ్లు ఒక్కోసారి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. హ్యాపీగా సాగుతున్న జీవితంలో ఒక్కోసారి ఒంటరితనం అలుముకుంటుంది. హాస్టల్‌‌కు వెళ్లడం వల్లనో, ఉద్యోగాల కోసం బయట ఊరిలో ఉండటం వల్లనో ఒంటరితనం ఏర్పడుతుంది. కొందరికి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం. ఇంకొందరికి అది అంత ఈజీ  కాదు. అయితే, ఒంటరిగా కూడా హ్యాపీగా ఉండొచ్చని చెబుతున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఒకరమే ఉంటే ఎవరి గురించి వాళ్లు తెలుసుకునే వీలు ఉంటుందంటున్నారు. సింగిల్‌‌గా ఉన్నా ఆనందంగా ఉండాలంటే ఈ ఏడు పనులు చేయాలంట.
కొత్త విషయాలు నేర్చుకోవాలి
చాలామందికి ఒంటరిగా ఉండాలంటే ఇష్టం ఉండదు. ఫ్రీ టైంలో ఏం చేయాలో అర్థంకాదు. అలాంటప్పుడు కొత్త విషయాలు నేర్చు కోవడంపై దృష్టి పెట్టాలి. పెయింటింగ్‌‌, డాన్స్‌‌ లాంటివి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కొత్త టాలెంట్‌‌ బయటికి వస్తుంది. ఎవరి గురించి వారికి తెలుస్తుంది. 
ఇతరులతో పోల్చుకోవద్దు
ఎప్పుడూ కూడా వేరేవాళ్లతో పోల్చుకోవద్దు. ‘వాళ్ల లైఫ్‌‌ అలా ఉంది. నా లైఫ్‌‌ ఇలా అయ్యింది’ అనే పోలిక ఉంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ప్రతి ఒకరి జీవితంలో కష్టాలు, బాధలు ఉంటాయనే నిజాన్ని తెలుసుకోవాలి. ఎదుటి వాళ్లు పెడుతున్న ఫొటోలు చూసి వాళ్లు ఎంజాయ్‌‌ చేస్తున్నారనే ఆలోచన తీసేయాలి. ఆనందంగా ఉన్నట్టు పోజులిచ్చి ఫొటోలు పెట్టినంత మాత్రాన అందరూ హ్యాపీగా ఉంటారనే విషయం కరెక్ట్‌‌ కాదు. 
సోషల్‌‌ మీడియాకు దూరంగా..
సోషల్‌‌ మీడియా వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడో దూరంగా ఉన్నవాళ్లు కూడా ఏం చేస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. కానీ, మనిషిలో యాంగ్జైటీ, స్ట్రెస్‌‌ పెరగడానికి సోషల్‌‌ మీడియా ఒక కారణం. అందుకే, దానికి దూరంగా ఉంటూ టైం గడపాలి. 
ఎవర్ని వారు బుజ్జగించుకోవాలి
లైఫ్‌‌లో ఎంత బిజీగా ఉన్నా తమ కోసం టైం కేటాయించాలి. బ్యూటీ కేర్‌‌‌‌ కోసం స్పాకి వెళ్లడం లాంటివి చేయాలి. ఇష్టమైన రెస్టారెంట్‌‌లో బ్రేక్‌‌ఫాస్ట్‌‌ చేయడం. ఇష్టమైన ప్లేసులు తిరగడం లాంటివి చేయాలి. దానికోసం వారంలో ఒక రోజు షెడ్యూల్‌‌ పెట్టుకోవాలి. 
ఎక్సర్‌‌‌‌సైజ్‌‌..
ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ను అంతగా పట్టించుకోరు ఎక్కువమంది. కానీ, అది చాలా ముఖ్యమైన యాక్టివిటీ. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం వల్ల బ్రెయిన్‌‌లో ఎండార్ఫిన్స్‌‌, న్యూరో ట్రాన్స్‌‌మిటర్స్‌‌ యాక్టివ్‌‌ అవుతాయి. దానివల్ల టెన్షన్స్‌‌ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ప్రతిరోజు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయడం వీలు కాకపోయినా యాక్టివ్‌‌గా ఉండేందుకు ట్రై చేయాలి. 
ప్రకృతి ఒడిలో..
హ్యాపీగా ఉండాలంటే ప్రకృతితో గడపాలి. గార్డెన్‌‌, పార్క్‌‌లో వాకింగ్ చేయడం లేదా లాంగ్‌‌డ్రైవ్‌‌ వెళ్లడం లాంటివి చేయాలి. ప్రకృతి‌‌లో గడపడం వల్ల లో బీపీ, స్ట్రెస్‌‌ లాంటివి దూరం అవుతాయి. 
థ్యాంక్‌‌ఫుల్‌‌గా ఉండాలి
జీవితంలో మీరు సాధించిన విషయాలు, అప్రిషియేషన్స్‌‌ వచ్చిన విషయాలను ఒక లిస్ట్‌‌లా రాసుకోవాలి. ఎప్పుడైనా దిగులుగా లేదా ఇబ్బందిగా అనిపించినా వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్లకు వాళ్లు ఎంకరేజ్‌‌మెంట్‌‌ ఇచ్చుకుంటారు.