మియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం

మియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం

మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మంటలు  చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఫైర్ ఇంజన్ తో మంటలను అదులోకి తెచ్చారు సిబ్బంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.