కరెంట్​తో చేపలు పడుతూ.. షాక్ తో వ్యక్తి మృతి

కరెంట్​తో చేపలు పడుతూ.. షాక్ తో వ్యక్తి మృతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కరెంట్​తో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ షాక్​కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. కొత్తగూడెం చిట్టి రామవరం ప్రాంతానికి చెందిన బానోత్​ కిషన్(37) కూలి పనులు చేస్తుంటాడు. పని దొరకనపుడు చుంచుపల్లి మండలం గోధుమ వాగులో చేపలు  పట్టేందుకు వెళ్లేవాడు. ఎప్పటిలానే శుక్రవారం కూడా వెళ్లాడు. గాలం, వలతో కాకుండా కరెంట్​తో చేపలు పట్టాలని ప్లాన్ ​చేశాడు. సమీపంలోని కరెంట్​స్తంభం నుంచి వైర్లను లాగి చేపలు ఎక్కువగా తిరిగే  ప్రాంతంలో వదిలాడు. దీంతో కరెంట్​షాక్​తగిలి కొన్ని చేపలు చనిపోయాయి. మరికొన్ని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​కు గురై కిషన్ ​అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.