ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ 7రోజులు

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ 7రోజులు

న్యూఢిల్లీ: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు మారాయి. తాజాగా ఈ ఆఫర్ 7రోజులపాటు అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది. గతంలో 4 రోజులపాటు ఆఫర్ ను అందుబాటులో ఉంచుతూ అక్టోబర్ 7-10 తేదీల మధ్య ఆఫర్ ఉంటుందని గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 
ఫ్లిప్ కార్ట్ కు పోటీ అన్నట్లు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను అక్టోబర్ 4 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్ వర్గాల్లో కుదిపేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రకటనను .. సవాల్ విసురుతున్నట్లు భావించిన ఫ్లిప్ కార్ట్ తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇది వరకు అక్టోబర్ 7 నుంచి 10వ తేదీలకు బదులు.. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ అందుబాటులో ఉంటుందని ప్రకటించి అమెజాన్ సవాల్ కు సై అంటూ సరికొత్త పోటీకి తెరలేపింది.

కరోనా సంక్షోభం తర్వాత మార్కెట్ మళ్లీ గాడిలో పడేందుకు ఈ బిగ్ బిలియన్ డేస్ చాలా కీలకంగా భావిస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ కార్యక్రమం కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుందని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా బిగ్ బిలియన్ డేస్ తేదీలను మార్చడం జరిగిందని ఆయన వివరించారు.