కరోనా బారిన 2 వేల మంది సాకర్‌ అభిమానులు

కరోనా బారిన 2 వేల మంది సాకర్‌ అభిమానులు

ఫుట్‌బాల్‌ పై ఉన్న అభిమానం స్కాట్లాండ్‌లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యింది. యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో. యూరో ఛాంపియన్ షిప్ నిర్వహించారు. అయితే అది కాస్తా వివాదాస్పదంగా మారింది. అయినప్పటికీ సాకర్‌ అభిమానులు వెనక్కి తగ్గట్లేదు. ఇక తమ టీం మ్యాచ్‌ కోసం స్కాట్లాండ్ నుంచి  అభిమానులు ..లండన్‌కు పెద్ద ఎత్తున్న క్యూ కట్టారు. వందల మైళ్లు రైళ్లలో, విమానాల్లో ప్రయాణించి.. మరీ ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను చూసి వచ్చారు. దీంతో సుమారు 2 వేల మంది సాకర్‌ అభిమానులకు కరోనా సోకినట్లు స్కాట్లాండ్‌ ప్రజా ఆరోగ్య శాఖ తెలిపింది.

మొత్తం 1,991 మంది కరోనా బారిన పడగా.. అందులో 1,294 మంది కేవలం ఇంగ్లండ్- స్కాట్లాండ్ ఒక్కమ్యాచ్‌ కోసం వెళ్లి వచ్చిన వాళ్లుగా అధికారులు కన్ఫాం చేశారు. మ్యాచ్‌లు జరిగే సమయంలో స్కాట్లాండ్‌ గ్లాస్గోలోని హంప్‌డెన్‌ స్టేడియం దగ్గర జనాలు భారీగా గుమిగూడారు. ఇదే కాదు..బార్‌లు, పబ్‌ల దగ్గర కూడా జనాలు గుంపులుగుంపులుగా ఉండటంతో పాటు మాస్క్‌లు లేకుండా తప్పతాగి సంబురాలు చేసుకున్నారు. దీంతో కరోనా భారీగా పెరగడానికి కారణంగా చెప్పారు అధికారులు.