పిల్లలు స్మార్ట్​ ఫోన్లకు అతుక్కుపోతున్నరు

పిల్లలు స్మార్ట్​ ఫోన్లకు అతుక్కుపోతున్నరు

కరోనా, లాక్​డౌన్​తో ఫిజికల్ గేమ్స్, యాక్టివిటీస్​ లేవు
ఆన్​లైన్​ క్లాసులు కూడా  లేక గ్యాడ్జెట్స్ కు  అడిక్ట్ 
చిన్నారుల ఆలోచనల్లో వస్తున్న మార్పులు
ఇంటి పనుల్లో ఇన్​వాల్వ్​చేయాలంటున్న సైకాలజిస్టులు 
యోగా, మెడిటేషన్, గార్డెనింగ్  దృష్టి మరల్చాలంటున్న టీచర్లు

వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్ ​చేసి యోగా నేర్పిస్తున్నం 
 మా స్కూల్​లో 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లకు క్లాస్ వైజ్​గా వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నాం. యోగాకు సంబంధించిన వీడియోలను వారి వాట్సాప్ గ్రూపులో పెడుతున్నాం. కొంతమంది స్టూడెంట్స్ జూమ్ కాల్ ద్వారా ఆన్​లైన్​ యోగా క్లాసులను కూడా ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ కూడా కేర్ తీసుకుని పిల్లలను ఎంకరేజ్ చేయాలి.                                                                                                       - రమాదేవి, హెచ్ఎం, స్పార్క్ స్కూల్, ఉప్పల్

పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలె
 పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం ఎప్పటి నుంచో ఉన్నా గతేడాది లాక్ డౌన్  నుంచి ఇది మరింతగా పెరిగింది. పేరెంట్స్ తమ ఫోన్లను పిల్లలకు ఇచ్చి వారిని అలాగే వదిలేయకూడదు. వారు ఫోన్ లో ఏయే యాప్స్​వాడుతున్నారో, ఎలాంటి వీడియోలు చూస్తున్నారో గమనిస్తూ ఉండాలి. వీలైనంత వరకు వారి మైండ్​ను డైవర్ట్ చేసేలా చూడాలి.  పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఇంటి పనుల్లోనూ  ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే పిల్లలు చురుకుగా ఉంటారు.
                                                                                                                                                        - డా. హరిణి, సైక్రియాట్రిస్ట్, కేర్ హాస్పి టల్స్, హైటెక్ సిటీ