రైతు కుటుంబానికి రూ.10 లక్షల సాయం

 రైతు కుటుంబానికి రూ.10 లక్షల సాయం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవి పంది దాడిలో చనిపోయిన రైతు కుటుంబానికి అటవీ శాఖ అధికారులు రూ.10 లక్షల సాయం అందించారు. భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు దాగామ రామయ్య ఆగస్టు 16న పత్తి చేనుకు వెళ్తూ అడవి పంది దాడి చేయడంతో మృతి చెందాడు. దీంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును ఆదివారం రైతు కుటుంబానికి మంచిర్యాల డీఎఫ్​వో శివ్​ఆశిష్ ​సింగ్,​ కుశ్నపల్లి రేంజ్​అధికారి దయాకర్​అందజేశారు. 

డీఎఫ్​వో మాట్లాడుతూ.. అటవీ జంతువుల దాడుల్లో మనుషులు చనిపోయినా, పంట నష్టం జరిగిన వెంటనే బాధితులు అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఫారెస్ట్​అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి విచారణ చేపడతారని చెప్పారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లోనే నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.