దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలుపిండితే వస్తయా

దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలుపిండితే వస్తయా

తాను ఆవులాంటి వాడిని..తవుడు ఎక్కువేస్తే పాలు ఎక్కువిస్తానని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆటో నగర్ మెకానిక్ లతో సమావేశమయ్యారు. వర్క్ షెడ్ల నిర్మాణం కోసం మూడు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన గంగుల..బర్రెకు పల్లిపిండి, తవుడు ఎక్కువేస్తే పాలు ఎక్కువిస్తుందని... అదే దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలుపిండితే వస్తాయా ?  ఓ జాడించి తందున్నారు. బర్రె పాలు పిండుకోవాలంటే తవుడు వేసినట్లు.. మాకు ఓటేయాలని అన్నారు.

ఇంకో మూడేళ్లు టీఆర్ఎస్ ఉంటుంది...మూడేళ్లు కేసీఆర్ సీఏంగా ఉంటారు.. గంగుల కమలాకర్ మంత్రిగా ఉంటాడని అన్నారు. ఏడేళ్లు నీవు ప్రభుత్వంలో ఉండి ఏ పని చేయలేదు.. గెలిస్తే పనుల కోసం ఏ సీఎం దగ్గరకు పోతావంటూ పరోక్షంగా ఈటలను ప్రశ్నించారు. ప్రధాని మోడీ దగ్గరకు, అమిత్ షా దగ్గరకు పోతావా? వాళ్లున్న గుజురాత్, యూపీలోనే ఏమీ చేయడం లేదన్నారు. మూడెకరాల భూమి అంటున్నావు కదా.. కేంద్రంతో మాట్లాడి రెండు ఎకరాలు ఇప్పించు.. నీతో అవుతుందా అని అన్నారు.

అంతేకాదు చేతగాని వ్యక్తి ఓటెలా అడుగుతాడు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉండి పని చేయలేదని ఈటలను విమర్శించారు గంగుల. పనిచేసే మాకే ఓటేయండి.. మీకు కడుపునిండా తిండి పెట్టి గౌరవంగా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం నుంచి మంచి పనులు కావాలంటే టీఆర్ ఎస్ కు భారీగా ఓట్లు వేయాలన్నారు గంగుల కమలాకర్.