- గతేడాదితో పోలిస్తే 16 శాతం అప్
- క్వెస్ కార్ప్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఏఐతో ఉద్యోగాలకు భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుండగా, భారత ఐటీ రంగం మాత్రం ఈ ఏడాది భారీగానే ఉద్యోగాలు వచ్చింది. క్వెస్ కార్ప్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఉద్యోగాల డిమాండ్ 18 కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 16 శాతం పెరిగింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఐటీ నియామకాల్లో ప్రధాన పాత్ర పోషించాయి.
వీటి వాటా 2024 లో 15 శాతం ఉండగా 2025 లో 27 శాతానికి పెరిగింది. ప్రొడక్ట్, సాస్ కంపెనీలు కొన్ని విభాగాల్లో నియామకాలు చేపట్టగా ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ రంగాలు స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. నిధుల కొరత వల్ల స్టార్టప్ నియామకాలు తగ్గాయి. అనుభవం ఉన్న నిపుణులకు మార్కెట్లో మంచి డిమాండ్ లభించింది. 4–10 ఏళ్ల అనుభవం గల నిపుణుల వాటా 65 శాతంగా ఉంది. గతేడాది ఇది 50 శాతంగా ఉండేది. ఎంట్రీ లెవెల్ నియామకాలు 15 శాతంగా నమోదయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు 11 శాతానికి పెరిగాయి. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది.
