- మూడు రెన్యూవబుల్
- ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు
న్యూఢిల్లీ: స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఇండియాలో మూడు కొత్త రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. సుమారు 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 వేల కోట్ల)ను ఇందుకోసం ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లో ఏర్పాటు అవుతాయి. వీటి ద్వారా ఒక గిగావాట్ సోలార్, విండ్ ఎనర్జీ సామర్ధ్యాన్ని కంపెనీ సాధించనుంది.
ఇండియాలో ఆర్సెలర్ మిట్టల్ రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం రెండు గిగావాట్లకి పెరగనుంది. గ్లోబల్‌గా కెపాసిటీ 3.3గిగావాట్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ ఆర్సెలర్ మిట్టల్–నిప్పాన్ స్టీల్ జేవీ (ఏఎంఎన్‌ఎస్) ఇండియాకి సరఫరా అవుతుంది. కంపెనీ అమరావతి, మహారాష్ట్రలో 36మెగా వాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను, బికనేర్, రాజస్థాన్‌లో 400మెగావాట్ల సోలార్ ఎనర్జీ, 500మెగావాట్‌అవర్ కెపాసిటీ గల బ్యాటరీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేయనుంది. మరో - 250మెగావాట్ల విండ్, 300 మెగావాట్ల సోలార్, 300మెగావాట్‌అవర్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌లో నిర్మిస్తుంది.
