వీధికుక్క దాడి...ఐదుగురికి గాయాలు.. కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో ఘటన

వీధికుక్క దాడి...ఐదుగురికి గాయాలు..  కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​నియోజకవర్గం చింతల్ డివిజన్​లోని భగత్ సింగ్ నగర్​లో సోమవారం ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. గాయపడిన వారిలో సురేశ్ అనే బాలుడితోపాటు జనార్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, మరో ఇద్దరు ఉన్నారు. వీరిని స్థానికులు సమీప హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కలను తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.