ఛత్తీస్‌‌గఢ్‌‌లో మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ

ఛత్తీస్‌‌గఢ్‌‌లో మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ
  • ఫ్యాక్టరీని కూల్చి, డంప్‌‌ను స్వాధీనం చేసుకున్న భద్రతాబలగాలు

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మీనగట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు గుర్తించి కూల్చివేశాయి. సోమవారం కూంబింగ్‌‌కు వెళ్లిన సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలు ఈ డంప్‌‌ను గుర్తించాయి. 

ఎనిమిది సింగిల్‌‌ షాట్‌‌ రైఫిల్స్‌‌, బోర్‌‌ కాట్రిడ్జ్‌‌లు 15, ఐదు ఎలక్ట్రిక్‌‌ డిటోనేటర్లు, కార్డెక్స్‌‌ వైర్‌‌, మల్టీ మీటరు, సేఫ్టీ ఫ్యూజ్‌‌, రెండు కిలోల పీఈకే పేలుడు పదార్థం, కిలో ఎన్‌‌ఎఫ్‌‌వో, 10 కిలోల అమ్మోనియం నైట్రేట్‌‌, ఎనిమిది వైర్‌‌లెస్‌‌ వీహెచ్‌‌ఎఫ్‌‌ సెట్లు, వెల్డింగ్‌‌ మెషీన్‌‌, కట్టర్‌‌ మెషీన్‌‌, మావోయిస్టుల యూనిఫాం, తయారీ సామగ్రి, విప్లవ సాహిత్యం, సింగిల్​షాట్​ రైఫిల్‌‌ ఫ్యాక్టరీకి అవసరమైన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ మాట్లాడుతూ... మావోయిస్టులు ఆయుధాలు తయారు చేసుకునేందుకు ఈ ఫ్యాక్టరీనే ఉపయోగిస్తున్నారన్నారు.