పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం : కలెక్టర్ జితేశ్ 

పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం : కలెక్టర్ జితేశ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని కలెక్టర్ జితేశ్​ ​వి పాటిల్​ తెలిపారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో గ్రామీణ కుటుంబాలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 మంది మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడుకి పది కిలోల కోళ్ల దాణాతోపాటు అవసరమైన ఫీడర్లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్ఎంఆర్​ఐ సీనియర్ సైంటిస్ట్​ డాక్టర్ యోగేశ్​ దడేకర్, ఐడీవో డాక్టర్​ కపిల్​శర్మ, పశు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.