భద్రాచలం, వెలుగు : వచ్చే నెలలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం వేడుకలకు ముత్యాల తలంబ్రాలను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన భక్తుడు రూ.19 లక్షల విరాళం అందజేశారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు జి.పుష్పారావు కుటుంబ సమేతంగా శనివారం సీతారాములను దర్శించుకునేందుకు భద్రాచలం వచ్చారు.
స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఈవో దామోదర్రావును ఆయన కలిశారు. సీతారాముల కల్యాణానికి అవసరమై ముత్యాల తలంబ్రాలను కొనేందుకు రూ.19 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు.
