సంతోష్ ట్రోఫీలో తెలంగాణ బోణీ

సంతోష్  ట్రోఫీలో తెలంగాణ బోణీ


హైదరాబాద్, వెలుగు: సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్‌‌‌‌బాల్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ శుభారంభం చేసింది. ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని నారాయణ్‌‌‌‌పూర్ వేదికగా జరిగిన గ్రూప్‌‌‌‌–ఎఫ్‌‌‌‌  తొలి మ్యాచ్‌‌‌‌లో  2-–1తేడాతో  ఆతిథ్య ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌పై ఉత్కంఠ  విజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ 47వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, ఇమ్రాన్ అలీ 59వ నిమిషంలో రెండో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని డబుల్ చేశాడు.

అశోక్ కుంజూర్ 80వ నిమిషంలో  గోల్ చేసినప్పటికీ తెలంగాణ డిఫెన్స్‌‌‌‌ను ఛేదించలేక ప్రత్యర్థి జట్టు స్కోరు సమం చేయలేకపోయింది.  బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో ఒడిశాతో తెలంగాణ తలపడనుంది.