- డెయిలీ వేజ్ కిందకు మారుస్తూ టెండర్ రిలీజ్చేయడంపై ఆందోళన
- ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
హైదరాబాద్సిటీ, వెలుగు: వాటర్బోర్డులో 10 నుంచి 20 ఏండ్లుగా పనిచేస్తున్న 673 మంది ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం జలమండలి హెడ్డాఫీసు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. జీవో 60 ప్రకారం బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్స్ కు రూ.15,600 జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ఇచ్చేవారని, కానీ..ఎటువంటి జీవో లేకుండా తమను డెయిలీ వేజ్కిందకు మారుస్తూ టెండర్ విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యపై అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్లానింగ్కమిషన్వైస్ చైర్మన్చిన్నా రెడ్డి చెప్పినా, ప్రొఫెసర్కోదండరాం ఎండీ అశోక్ రెడ్డికి చెప్పినా ఫలితం లేదన్నారు.
మీటర్ రీడర్స్ ను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ లో నమోదు చేయాలని చెప్పినా వినకుండా.. ఆ ఉత్తర్వులను పక్కనపెట్టి టెండర్ల విధానం ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఔట్సోర్సింగ్స్టేట్ జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య, తెలంగాణ జన సమితి కార్మికశాఖ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకృష్ణా రెడ్డి, రమేశ్, ఉపేందర్, మనోజ్, వినోద్, శ్రీకాంత్ , సోమి రెడ్డి, రవి, అంజి రెడ్డి, విక్రమ్, మహేందర్ రెడ్డి, శేఖర్, పాల్గొన్నారు.
