జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందే హాల్లో గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ వచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల దగ్గర ఉన్న ఫ్లకార్డులను మార్షల్స్ లాక్కెళ్లారు. దీంతో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు. మార్షల్స్ హాల్ లోపటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభం అవ్వడానికి ముందే మార్షల్స్ హాల్ లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు కార్పొరేటర్లు.
చివరి సమావేశం
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయ్యింది. మాగంటి గోపినాథ్, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందె శ్రీ కి సభలో సంతాపం తెలిపారు సభ్యులు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం ఇది. 2026 ఫిబ్రవరి 11తో కౌన్సిల్ గడవు ముగియనుంది. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కార్పోరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు సభ్యులు.
