మహా శివరాత్రికి 330 ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రికి 330 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహా శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ నగరం నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు నేటి నుంచి ఈ నెల 17 వరకు 330 ప్రత్యేక బస్సులను నడుపనుంది. సికింద్రాబాద్ రిజిమెంటల్ బజార్ నుంచి కీసరగుట్టకు 91 బస్సులు, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి 117, అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి 52 బస్సులు బయలుదేరతాయి.

ఏడుపాయల, బీరంగూడ జాతరకు సంబంధించి సీబీఎస్ నుంచి ఏడుపాయలకు 115 బస్సులు, పటాన్​చెరు నుంచి ఏడుపాయలకు 10 బస్సులు, పటాన్​చెరు నుంచి బీరంగూడ జాతరకు 20 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇతర వివరాలకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ కమ్యూనికేషన్ సెంటర్ ఫోన్ నెంబర్ 9959226160కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.