రేవల్లి, వెలుగు: అర్హులైన ప్రతిరైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని గోపాల్‌పేట, రేవల్లి మండలాల కాంగ్రెస్ ఇన్‌చార్జి సత్య శీలారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రేవల్లిలో మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదని, ఇలా రెండు మండలాల్లో తప్పుగా వివరాలు నమోదు అయినవారిలో156 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు చెప్పారు.
వీరికి శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని వారికి రుణమాఫీ చేస్తారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని, సన్న రకాలకు రూ.500 బోనస్ కూడా ఇస్తోందన్నారు. సమావేశంలో రేవల్లి మండల అధ్యక్షుడు వాడల పర్వతాలు, లీడర్లు సురేశ్ గౌడ్, తిరుపతయ్య, వెంకటేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.