సరస్వతి దేవిని అవమానించిన టీచర్ ను సస్పెండ్​ చేసిన అధికారులు

సరస్వతి దేవిని అవమానించిన టీచర్ ను సస్పెండ్​ చేసిన అధికారులు

రాజస్థాన్​లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తప్పించారు.  చదువుల తల్లి సరస్వతీ దేవిని అగౌరవపరచినందుకు  రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకుటీచర్​  హేమలతా బైర్వానును శనివారం ( ఫిబ్రవరి 24) సస్పెండ్​ చేశారు. విద్యార్థులు సరస్వతిదేవిని కొలుస్తారు.  చాలా స్కూళ్లలో సరస్వతి నమస్తుభ్యం అని కూడా పాఠశాల ప్రార్థనలో ఈ శ్లోకాన్ని చదివిస్తారు. 

 స్కూళ్లలో సరస్వతి దేవి వల్ల ఉపయోగం ఏమిటని టీచర్​ ప్రశ్నించారు.  పిల్లలకు సరస్వతి దేవి సహకారం ఏమీ ఉండదని చెప్పడంతో ... మత పరమైనన భావాలను రెచ్చగొట్టే విధంగా బరాన్​ జిల్లాలోని కిషన్​ గంజ్​ ప్రాంతంలో  గురువారం( ఫిబ్రవరి 22)న ఒక బహిరంగ సభలో ప్రసంగించారు.  దీంతో  లక్డై గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రబోధక్ లెవల్ 1 టీచర్ హేమలత బైర్వాను సస్పెండ్ చేస్తూ బరన్ జిల్లా విద్యా (ప్రాథమిక) అధికారి  ఉత్తర్వులు జారీ చేశారు