డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చోగా..తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో  కిలో పచ్చిమిర్చి  రూ. 160గా ఉంది. దీంతో సామాన్చ జనం పచ్చిమిర్చి కొనడం పక్కన పడితే వాటిని చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది. 

పావు రూ. 40..

రైతు బజార్లు, ఇతర కూరగాయల మార్కెట్లలో కిలో పచ్చిమిర్చి రూ. 160గా అమ్ముడవుతోంది. ఇక కూరగాయల దుకాణాల్లో 250 గ్రాముల పచ్చిమిర్చికి రూ. 40 వసూలు చేస్తున్నారు. 

ధరల పెరుగుదలకు కారణం..

నెల క్రితం వరకు రాష్ట్రంలో పచ్చిమిర్చి నిల్వలు సరిపడా ఉన్నాయి. దీంతో ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. కానీ జూన్ రెండో వారం నుంచి ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగాయి. దిగుబడి తగ్గడంతో టమాటా, పచ్చిమిర్చి ధరలు అయితే కొండెక్కాయి. అయితే దీనికి కారణం రైతులు పచ్చిమిర్చి పండించకపోవడమే. అటు వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు..రవాణా చార్జీలు పెరగడంతో మిర్చి, టమాటా ధరలు అమాంతం పెరిగాయి.