సుశీ ఇన్ ఫ్రాలో ముగిసిన జీఎస్టీ అధికారుల దాడులు

సుశీ ఇన్ ఫ్రాలో ముగిసిన జీఎస్టీ అధికారుల దాడులు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడికి చెందిన.. సుశీ ఇన్ ఫ్రా ఆఫీస్ లో స్టేట్ GST అధికారుల తనిఖీలు ముగిశాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రా ఆఫీస్ తో పాటు అనుబంధ సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి. 24 బృందాలుగా విడిపోయి ఉదయం 11గంటల నుంచి తనిఖీలు చేశారు. దాదాపు 9 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. తనిఖీల్లో  పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు . 

సుశీ ఇన్ ఫ్రాకు సంబంధించిన ప్రాజెక్టు అలాట్మెంట్ పత్రాలు, ప్రాజెక్టు వ్యాల్యూ.. చెల్లించిన జీఎస్టీ పత్రాలు జీఎస్టీ అధికారులు పరిశీలించారు. సుశీ ఇన్ ఫ్రాతో పాటు మైనింగ్ లావాదేవీలపై  ఆరా తీశారు. సోదాల సమయంలో బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు వెళ్లకుండా.. 50మంది ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకుని తనిఖీలు చేశారు. అయితే దాడుల కంటే ముందే ఉదయం నాంపల్లి కమిషనర్ ఆఫీసులో 5డివిజన్లకు సంబంధించిన స్టేట్ GST అధికారుల మీటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. తర్వాతే అంతా కలిసి సుశీ ఇన్ ఫ్రాలో తనిఖీలు చేసినట్లు సమాచారం.