ఐపీఎల్‌‌లో సపోర్ట్‌‌ స్టాఫ్‌‌గా హర్భజన్​!

ఐపీఎల్‌‌లో సపోర్ట్‌‌ స్టాఫ్‌‌గా హర్భజన్​!

ముంబై:  టీమిండియా స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ (41) అతి త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ చెప్పనున్నాడు. ప్లేయర్‌‌గా కాంపిటీటివ్‌‌ క్రికెట్‌‌కు దూరం కానున్నాడు. కానీ ఐపీఎల్‌‌లో ఓ ఫ్రాంచైజీతో కలిసి సపోర్ట్‌‌ స్టాఫ్‌‌గా పని చేయనున్నాడు. ఇందుకోసం అతి త్వరలో రిటైర్మెంట్‌‌ ప్రకటించనున్నాడని ఐపీఎల్‌‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌, ముంబై ఇండియన్స్‌‌లో ఓ జట్టుకు భజ్జీ పని చేసే అవకాశం ఉంది.

‘కన్సల్టెంట్‌‌, మెంటార్‌‌ లేదా అడ్వైజరీ గ్రూప్‌‌లో ఏదో ఒక పదవిని హర్భజన్‌‌కు ఇవ్వనున్నారు. భజ్జీ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఓ ఫ్రాంచైజీ యూజ్‌‌ చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మెగా ఆక్షన్‌‌లో ప్లేయర్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే యాక్టివ్‌‌గా పని చేస్తున్నాడు. ఆ ఫ్రాంచైజీతో ఒప్పందం పూర్తి అయిన తర్వాత భజ్జీ రిటైర్మెంట్‌‌ ప్రకటిస్తాడు. అది వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండవచ్చు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.