తిరుమల కొండపై ముక్కోటి ఏకాదశి రద్దీ .. బారులు తీరిన భక్తులు

తిరుమల కొండపై ముక్కోటి ఏకాదశి రద్దీ .. బారులు తీరిన భక్తులు

శనివారం ( డిసెంబర్​ 23)  వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి.. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్‌ చేరుకుంది. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. 

తిరుమల కొండపై ఏకాదశి రద్దీ నెలకొంది. భక్తులు బారులు తీరారు . ప్రస్తుతం క్యూలో ఉన్నవారికి ( మధ్యాహ్నం 12 గంటలకు) ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్వామిని దర్శించుకొనేందుకు  మంత్రులు, ఎమ్మెల్యేలుక్యూ కడుతున్నారు. 

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని( Vaikuntham Q Complex ) కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనం లోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.టీటీడీ కూడా భక్తులకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగిసిన తర్వాత సర్వదర్శనం భక్తులకు వేగంగా దర్శనం పూర్తయ్యలా చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే తిరుమలలో అద్దె గదులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. శ్రీవారి దేవాలయం తో పాటు అన్నప్రసాద భవనం, లడ్డు వితరణ కేంద్రం, మాడ వీధులు, రోడ్లు, అఖిలాండం, బస్టాండ్, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులతో రద్దీగా ఉంది.