హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు

హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు

హైదరాబాద్ : హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నాలుగు గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.