తమిళనాడులో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు

తమిళనాడులో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు
  • వాతావరణశాఖ తాజా ప్రకటన

చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఇప్పట్లో  వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న తమిళనాడు  ప్రజలకు భారత వాతావరణశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు, ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పుదుచ్చేరి, కరైకల్ తోపాటు.. పలు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాతవారణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర  ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధించింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రజా ప్రతినిధులు అధికారులకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే కోరారు. స్వయంగా వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను తనిఖీలు చేస్తున్నారు.