రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని చెప్పింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో..GHMC అలర్ట్ అయ్యింది. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరోవైపు ఏపీలోనూ జోరుగా కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు అధికంగానే పడుతున్నాయి.