జూబ్లీహిల్స్‌‌ స్థల స్వాధీనంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

జూబ్లీహిల్స్‌‌ స్థల స్వాధీనంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
  • హైడ్రా, జీహెచ్‌‌ఎంసీలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌ పోస్ట్‌‌ దగ్గర రూ.100 కోట్ల విలువైన రెండు వేల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంపై దాఖలైన పిటిషన్‌‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్‌‌కు సంబంధించి జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి.. హైడ్రా, జీహెచ్‌‌ఎంసీలకు నోటీసులు ఇచ్చి, కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించారు. 1991 నాటి లేఔట్‌‌ ప్రకారం జూబ్లీహిల్స్‌‌ చెక్‌‌ పోస్టు వద్ద జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని 4.66 ఎకరాల స్థలంలో పార్కు, టెన్నిస్‌‌ కోర్టు ఉన్నాయి. దీనిని సత్యనారాయణ అనే వ్యక్తి కబ్జా చేసి 2002 నుంచి నర్సరీ బిజినెస్‌‌ చేస్తున్నాడు.

 ఇటీవల బల్దియా, హైడ్రా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ చర్యను సవాల్‌‌ చేస్తూ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. చట్ట వ్యతిరేకంగా హైడ్రా తన స్థలంలోకి వచ్చిందని వాదించారు.  ఈ విచారణను కోర్టు ఈ నెల19కి వాయిదా వేసింది. దీనిపై హైడ్రా చీఫ్​రంగనాథ్​ స్పందించారు. జూబ్లీహిల్స్ స్థల స్వాధీనంపై ఎంక్వైరీ చేస్తున్నామని,  పబ్లిక్​ప్లేస్​అయితే ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుందన్నారు.