ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కౌంటర్లు దాఖలు చేయండి : హైకోర్టు

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కౌంటర్లు దాఖలు చేయండి :  హైకోర్టు
  • రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేం ద్రనగర్‌‌‌‌ మండలం హైదర్‌‌‌‌గూడ ఉప్పర్‌‌‌‌పల్లి లో 2 ఎకరాల భూ ఆక్రమణపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమ వారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెం.7లో 2 ఎకరాల భూమి ఆక్రమణపై ఎర్రబోడ వీకర్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ కాలనీ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక సీజే జస్టిస్‌‌‌‌ సుజయ్‌‌‌‌పాల్, జస్టిస్‌‌‌‌ యారా రేణుకతో కూడిన బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. 

భూమి రక్షణకు చర్యలు చేపట్టాలని గత ఏడాది వినతిపత్రం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని పిటిషనర్​ తరఫు అడ్వకేట్​వాదిం చారు. వాదనలను విన్న ధర్మాసనం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్, రాజేంద్రనగర్‌‌‌‌ ఆర్డీవో, తహసీల్దార్, జీహెచ్‌‌‌‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.