
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ప్రాథమిక సస్పెన్షన్ విధించింది. డోప్ పరీక్ష కోసం12 నెలల టైమ్‌లో మూడు సార్లు తన ఆచూకీ వెల్లడించకపోవడంతో నాడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో ఆమెపై ఏడాది నుంచి రెండేండ్ల బ్యాన్ పడే అవకాశం ఉంది. అసోంకు చెందిన 23 ఏండ్ల హిమ దాస్ గాయం కారణంగా ఆసియా గేమ్స్ టీమ్‌కు దూరమైంది.