ఎముకలు కొరికే చలిలో సైనికుల యోగాసనాలు

ఎముకలు కొరికే చలిలో సైనికుల యోగాసనాలు

అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా దేశంలోని పలు ప్రాంతంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తు్నారు. ఐటీబీపీ లాంటి భ‌ద్రతా బ‌ల‌గాలు సైతం ఉద‌యాన్నే యోగాస‌నాలు వేసి యోగా డేను జ‌రుపుకున్నాయి. ఈ నేప‌థ్యంలో నే భార‌త్‌ - చైనా స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇండో - టిబెట‌న్ బార్డర్ హిమవీర్స్ సైతం ఉత్తరాఖండ్‌, ల‌ఢ‌ఖ్ ప్రాంతాల్లోని మంచు కొండ‌ల‌పై యోగాసనాలు చేస్తూ.. యోగా డే జ‌రుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లో మంచు కొండ‌పై 16,000 అడుగుల ఎత్తులో సైనికులు యోగాస‌నాలు వేశారు. ల‌ఢ‌ఖ్‌లో కూడా 17000 అడుగుల ఎత్తుగ‌ల మంచు కొండ‌పై ఎముక‌లు కొరికే చ‌లిలో.. జీరో టెంప‌రేచ‌ర్ వ‌ద్ద జ‌వాన్లు యోగా చేయ‌డం గ‌మ‌నార్హం.