హాట్ ఎయిర్ బెలూన్షోలో అనుకోని సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో నార్సింగి సర్కిల్ మణికొండ నిక్నాపూర్ చెరువు వద్ద అత్యవసర ల్యాండింగ్ అయింది. నిన్న ( జనవరి 16) హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభమైంది.
సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిక్నాపూర్ గ్రామ శివారులోని చెరువు సమీపంలో 14వ నెంబర్ బెలూన్ ను ల్యాండింగ్ చేశారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, బెలూన్‌లో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం హోల్డింగ్ చేసి వాళ్ళ ట్రక్కులు తీసుకెళ్లారు.. ఈ బెలూన్ లో మొత్తం ముగ్గురు ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
