
బెంగళూరుకు చెందిన నందన్ రేణుక్కప్ప అనే యువకుడు 'అన్‌టేమ్డ్ స్ట్రీట్‌వేర్' పేరుతో ఓ స్టార్టప్‌ను ఒక చిన్న బండిపై నడుపుతూ దాదాపు రూ. 40 లక్షల టర్నోవర్ సంపాదిస్తున్నాడు. అది ఎలా సాధ్యం అని మీకు అనిపించినా.... అక్షరాలా నిజం... ఒక యువకుడు చిన్న వయస్సులోనే అతని వయస్సు మించి సంపాదించడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. బెంగళూరుకు చెందిన నందన్ రేణుక్కప్ప కాలేజ్ డేస్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నాడు. మొదట్లో కాలేజీల కోసం జాకెట్లు, హూడీలు పెద్ద మొత్తంలో తయారు చేశాడు. అదే అనుభవంతో బట్టల ఫ్యాషన్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో అతనికి అర్థమైంది.
2021లో చర్చి స్ట్రీట్‌లో ఉన్న ఒక ఐస్ క్రీం బండిని చూసి వీధి దుస్తుల(street wear) వ్యాపారాన్ని కూడా ఇలాగే స్టార్ట్ చేయాలనీ అతనికి ఆలోచన వచ్చింది. వీధి దుస్తులు అంటే స్నీకర్లు, హూడీలు, గ్రాఫిక్ టీ షర్టులు వంటి ఫ్యాషన్, కంఫర్ట్, సాధారణ దుస్తులు. ఇవి యువతకు, సిటీ కల్చర్ వాళ్లకి బాగా నచ్చుతాయి. నందన్ ఇండియన్ బ్రాండ్ బట్టలను గమనించినప్పుడు అవి లగ్జరీ విభాగంలోనో లేదా చాలా సాధారణ బట్టల విభాగంలోనో ఉన్నాయని, అయితే ప్రపంచ స్థాయి నాణ్యతతో లేవని గుర్తించాడు. అందుకే నాణ్యమైన వీధి దుస్తులను అందించడానికి స్టార్టప్‌ను ప్రారంభించాడు.
గొప్ప విషయం ఏంటంటే నందన్ టీమ్ వాళ్లే దుస్తులను డిజైన్ చేసి, ఉత్పత్తి చేస్తారు. ప్రింటింగ్/ఫినిషింగ్‌ను ఇన్-హౌస్ స్టూడియోలో చేస్తారు, అయితే కొంత తయారీ పనులను స్థానిక పార్ట్నర్స్ కి ఇస్తారు. ఈ బట్టలను నేరుగా కస్టమర్‌కు ఒక బండి (కార్ట్) ద్వారా అమ్ముతారు. ఇంకా త్వరలో ట్రక్కును కూడా ప్రారంభించాలని కూడా ప్లాన్ చేస్తున్నారట.
నందన్ రేణుక్కప్ప తన వైఫల్యాల నుండి నేర్చుకొని, స్వయంకృషితో, కేవలం ఒక బండిపై అమ్మకాలు ప్రారంభించడం ద్వారా రూ. 40 లక్షల వ్యాపారాన్ని నిర్మించగలిగాడు. త్వరలో ఆన్‌లైన్‌లో కూడా విస్తరించాలని, అన్‌టేమ్డ్‌ను భారతదేశ వీధి దుస్తుల బ్రాండ్‌గా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నాడు.
ప్రస్తుతం, అన్‌టేమ్డ్ స్ట్రీట్‌వేర్ దాదాపు 40 డిజైన్ల టీస్, హూడీలు, కార్గోలు, ఉపకరణాలను విక్రయిస్తుంది, వీటి ధరలు రూ. 899 నుండి 3,499 వరకు ఉంటాయి.