వికారాబాద్, వెలుగు: బాలికల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను వికారాబాద్హాస్పిటల్లో డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి ఆదివారం ప్రారంభించారు. 14 నుంచి 15 ఏండ్ల మధ్య ఉన్న బాలికలే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 10,610 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించామని, మొదటి రోజు 52 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆమె తెలిపారు. వికారాబాద్, తాండూర్, కొడంగల్, పరిగి, మర్పల్లి, బషీరాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో నెల రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని వివరించారు.
ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.పద్మారావునగర్: అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, పేదలకు మరింత మెరుగైన ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
