
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ నుంచి 1.2 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.68లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఎమర్జెన్సీ లైట్స్ ఉన్నట్లు గమనించారు. వాటిని చూడగానే అధికారులకు మరింత అనుమానం పెరిగింది.
ఆ లైట్స్ ను ఓపెన్ చేసి చూస్తే బంగారం బయటపడింది. బంగారాన్ని గుర్తు పట్టకుండా లైట్స్ లో దాచినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1287.6 గ్రాములున్న 14 కడ్డీల్లో బంగారాన్ని తరలిస్తున్నాడు.