అత్యాచారం కేసులో 4 గోడల మధ్య చెప్పిన సాక్ష్యానికి చట్టబద్ధత ఉండదు

అత్యాచారం కేసులో 4 గోడల మధ్య చెప్పిన సాక్ష్యానికి చట్టబద్ధత ఉండదు
  • కింది కోర్టు శిక్షను రద్దు చేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: అత్యాచార కేసులో నాలుగు గోడల మధ్య చెప్పిన సాక్ష్యానికి చట్టబద్ధత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. సాక్ష్యానికి చట్టబద్ధత ఉండాలంటే వైద్య నివేదికల ఆధారాలు ఉండాలంది. విశ్వసనీయ సాక్ష్యమని చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకోలేమని వెల్లడించింది. అలాంటి విశ్వసనీయ సాక్ష్యానికి ఇతర ఆధారాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తగిన సాక్ష్యాధారాలు లేకుండా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇర్ఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అత్యాచారం కేసు నమోదు చేయడాన్ని కొట్టివేసింది. గతంలో నాంపల్లి కోర్టు విధించిన పదేళ్ల జైలుశిక్షను రద్దు చేసింది.

 ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన తల్లిదండ్రులు లేని సమయంలో లైంగిక చర్యలకు పాల్పడ్డాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు 2009లో బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల ప్రేమాయణం సాగిన తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో 2008 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి బెదిరించి లైంగిక చర్యకు పాల్పడ్డాడని బాధితురాలు 2009 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసును విచారించిన నాంపల్లి కోర్టు..  పదేండ్ల జైలుశిక్ష, రూ.2 వేల రూపాయల జరిమానా విధించడాన్ని హైకోర్టులో ఖాన్  సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు. అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జె.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇటీవల విచారించి కింది కోర్టు తీర్పును రద్దు చేశారు. బాధితురాలి ఆరోపణలకు ఆధారాలు లేవని, రాతపూర్వక ఫిర్యాదు, మౌఖికంగా చెప్పిన అంశాలకు పొంతన లేదన్నారు. ఫిర్యాదు ఆలస్యంగా చేయడానికి చెప్పిన కారణాలు ఆమోదయోగ్యంగా లేవన్నారు.