హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పుణె వేదికగా జరగనున్న ‘బజాజ్ పుణె గ్రాండ్ టూర్’ గ్లోబల్ సైక్లింగ్ ఈవెంట్ ట్రోఫీ టూర్ శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ట్రోఫీని ఆవిష్కరించారు.
ఇలాంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్ ఇండియాలో జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇండియా తొలిసారిగా ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ (యూసీఐ) క్లాస్ 2.2 అంతర్జాతీయ స్థాయి సైక్లింగ్ రేస్‌ను నిర్వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు.
