రాష్ట్రంలో లాక్‌డౌన్ ను ప్రభుత్వం మరో పది రోజులు సడలించింది. దీంతో హైదరాబాద్ మెట్రో కూడా టైమింగ్స్ మార్పు చేసింది. రేపటి(మంగళవారం,జూన్-1)ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌కు 12.45కి చేరుకోనుంది.
ఇప్పటి వరకు ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం లేటెస్టుగా లాక్ డౌన్ ను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలించడంతో.. మెట్రో రైలు సమయాలను హైదరాబాద్ మెట్రో పొడిగించింది.
ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని, స్టేషన్ల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతుందని మెట్రో అధికారులు తెలిపారు.
