హైదరాబాద్‌ మెట్రో సమయాలు కుదింపు

హైదరాబాద్‌ మెట్రో సమయాలు కుదింపు

రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా.. రేపటి నుంచి 10 రోజుల పాటు మెట్రోరైలు సమయాలు కుదిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి 8.45 వరకు మాత్రమే మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎల్బీనగర్‌, నాగోలు, జేబీఎస్‌, మియాపూర్‌, రాయదుర్గం నుంచి ఉదయం 8.45కి చివరి రైలు ఉంటుందన్నారు. ఇవన్నీ 9.45 వరకు  చివరి స్టేషన్ కు చేరుకుంటాయి.

కరోనా విజృంభన కారణంగా రేపటి(బుధవారం) నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర్రంలో లాక్‌డౌన్‌ విధించాలని  సీఎం కేసీఆర్  నిర్ణయించారు.